Garuda puranam Telugu

Garuda Puranam in Telugu PDF

గరుడ పురాణం

శ్రీమహావిష్ణువు గరుడ కల్పంలో గరుడుడు ఉద్భవించిన విషయ వివరణ చేస్తూ బ్రహ్మాండ ఆరంభం దగ్గర నుంచి గరుడునికి వివరించిన పురాణం కాబట్టి దీనికి గరుడ పురాణమనే పేరు వచ్చింది. ఇందులో 264 అధ్యాయాలు 18వేల శ్లోకాలు ఉన్నాయని నారద పురాణం తెలుపుతున్నది. ఇది రెండు ఖండాలుగా ఉన్న పురాణం. పూర్వఖండంలో లౌకిక ఉపయోగానికి అవసరమైన సమస్త విద్యల వివరణ విస్తృతంగా ఉన్నది. పురాణ ప్రారంభం లోనే విష్ణువు ఆయన అవతారాల మాహాత్మ్యం గురించి తెలియజేయబడింది. దీనిలోని ఒక అంశంతో అనేక రకాల రత్నాల పరీక్ష , అలాగే ముత్యము (69 అధ్యాయం) పద్మరాగం (70వ అధ్యాయం) మరకత, ఇంద్రనీల, వైడూర్య , పుష్పరాగ, కరకేతన, భీష్మరత్న , పులక, రుధిరాఖ్య రత్నాలు, స్ఫటికము, విదృమ పరీక్షలు (71 నుంచి 80 అధ్యాయాల వరకు) తెలుపబడ్డాయి. ఇందులో రాజనీతి (108- 115 అధ్యాయాల వరకు) కూడా బాగా విస్తృతంగా వివరించబడింది. ఆయుర్వేదము యొక్క ఆవశ్యకత, రోగనిధానము, చికిత్సా విధానములను గురించి (15 నుండి 181 అధ్యాయాల వరకు) అనేక అధ్యాయాలలో వివరించబడింది. అనేక రకాల రోగాలను పోగొట్టడానికి ఔషధ విధానం (170-196వ అధ్యాయం వరకు) చెప్పబడింది. ఇది చాలా ప్రశంసనీయ విషయం. ఇంకొక అధ్యాయం (199) మనస్సును నిర్మలంగా ఉంచుకొనటానికి ఔషధాలను నిర్దేశించింది. ఆయుర్వేదాన్ని ప్రతిపాదించే ఈ 50 అధ్యాయాలు వేరు పుస్తకంగా ప్రకటించి, ఇతర ఆయుర్వేద గ్రంథాలలాగా దీనిని కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఛందశాస్త్ర విషయాలు (211 -216) అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. సాంఖ్య యోగాన్ని గురించి విపులంగా 14(230-243) అధ్యాయాలలో వివరించబడింది. ఒక అధ్యాయం (242)లో గీతా సారాంశం ఉన్నది. ఈ విధంగా గరుడపురాణం ఈ పూర్వాంశం అగ్ని పురాణం వలెనే సమస్త విద్యలకు విజ్ఞాన కోశంగా చెప్పవచ్చును.

ఈ పురాణం యొక్క ఉత్తర ఖండానికి, ప్రేత కల్పం’ అని పేరున్నది. ఇందులో 45 అధ్యాయాలున్నాయి. జీవి మరణించిన తరువాత మనుష్యునికి ఏ స్థితి కలుగుతుంది. అతడు ఏ యోని యందు తిరిగి పుట్టగలడు ఏఏ భోగాలను అనుభవిస్తాడు మొదలైన విషయాలు అక్కడక్కడా ఇతర పురాణాలలో ఉన్నా, ఈ పురాణంలో అత్యంత విస్తృతంగా సాంగోపాంగమైన వర్ణన ఉన్నది. ఇంత విస్తృతంగా వేరు పురాణాలలో లేదు. ఇందులో గర్భావస్థ, నరకము, యమ నగరమునకు మార్గము, ప్రేత గణముల వాసస్థానము ప్రేత యోని నుంచి ముక్తి, ప్రేతముల రూపము, మనుష్యుల ఆయుర్దాయము, యమలోక వివరణము, సపిండులైనందున చేయవలసిన విధులు, వృషోత్సర్గ విధానము మొదలైన విషయాలు ఆయా అధ్యాయాలలో విస్తృతంగా ఆసక్తికరంగా వివరించబడ్డాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు అశౌచకాలంలో ఈ ఉత్తరఖండం పురాణంగా చెప్పటం, దానిని ప్రేతబంధువులు వినటం సంప్రదాయంగా హిందువులలో ఉన్న విషయమే. ఈ ప్రేతకల్ప భాగం జర్మన్ భాషలోకి కూడా అనువదించబడింది.

నారదపురాణం, మత్స్యపురాణాలలో గరుడ పురాణ విషయాలుగా చెప్పబడినవి. యథాతథంగా లభ్యం అవుతున్నాయి. ప్రస్తుతం లభ్యం అవుతున్న గరుడ పురాణంలో ఏడువేల శ్లోకాలు ఉన్నాయి. లభ్యం అవుతున్న గరుడ పురాణంలో శ్లోకసంఖ్య తక్కువగా ఉన్నా, చెప్పబడిన విషయాలు మాత్రం కొరత లేదు. ఇందులోని భవిష్య రాజవంశాఖ్యానాన్ని చదివితే ఇది జనమేజయుని కాలంలో సంకలింపబడినట్లు తెలుస్తుంది. మత్స్య, విష్ణు పురాణాలలోని భవిష్యరాజ వంశాఖ్యాన వృత్తాంతాలలో ఆంధ్ర, గుప్త రాజవంశాలు పేర్కొనబడ్డాయి. కానీ ఇందులో ఆ వృత్తాంతాలు లోపించటంవలన, ఇది ఆ పురాణాలకంటే ప్రాచీనమని భావించటం సమంజసంగా ఉంటుంది.

శూద్రక మహారాజు కాలంలో బౌద్ధ హిందూ ధర్మాలు కలసిపోయాయి. ఆ సమయంలో బౌద్ధమతము, బుద్ధుని ఆరాధన మనదేశంలో ఎక్కువగా ఉండేది. అందువలననే బుద్ధుడు విష్ణువు యొక్క 21వ అవతారంగా పేర్కొనబడ్డాడు. ఇందులో ఋద్ధుని తండ్రి ఆయన వంశం (శుద్ధోధకో రాహులశ్చ సేనజత్ శూద్రక్తసథా) స్పష్టంగా చెప్పబడ్డాయి.

ఇందులోని వృత్తాంతం తార్ క్ష్యకల్పం నాటిది అని చెప్పబడింది. తార్ క్ష్యుడు గరుడుడే. అదే గరుడ కల్పవృత్తాంతం. ఇందులో గయామాహాత్మ్యం చాలా విపులంగా చెప్ప బడినందున గయ క్రీ.శ. 6,7 శతాబ్దాలలో విస్తృత ప్రచారంలోకి బౌద్ధమత పతనం తరువాత వచ్చినందున ఇది ఎనిమిదవ శతాబ్దం కాలంనాటి పురాణంగా భావించవచ్చు. మిథిలా ప్రాంతంలో దీని రచన జరిగి ఉండవచ్చని భావించబడుతున్నది. దీని నుండి ప్రత్యేకంగా త్రివేణీస్తోత్రము, పంచపర్వమాహాత్మ్యము, విష్ణు ధర్మోత్తరము, వేంకటగిరి మాహాత్మ్యము, శ్రీరంగనాథ మాహాత్మ్యము, సుందరపుర మాహాత్మ్యము మొదలైనవానిని ప్రత్యేక గ్రంథములుగా ఏర్పాటు చేయవచ్చును.

గరుడ పురాణం రెండు ఖండాలుగా విభజించబడింది. పూర్వ ఖండం, ఉత్తర ఖండం. దీనిలోని ఉత్తర ఖండానికే ప్రేత కల్పమనే ఇంకొక పేరు ఉన్నది. ఈ పురాణంలో పూర్వఖండంలో 240, ఉత్తర ఖండం (ప్రేత కల్పం)లో 78 అధ్యాయాలు మొత్తం 318 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో నారదపురాణానుసారం 19 వేల శ్లోకాలు మత్స్య పురాణానుసారం 18 వేల శ్లోకాలు ఉన్నాయి.

   Garuda Puranam in Telugu PDF  Download PDF Book                      

 

Complete Pravachanam on Garuda puranam by Sri Samavedam Shanmukha sharma. PDF BOOK IS BELOW THE VIDEO

SUBSCRIBE OUR YOUTUBE CHANNEL

Garuda Puranam Detail version in Simple Telugu

Get Garuda Puranam in Telugu PDF here:

 

 

 

Garuda-Puranam

 

Follow us on Social Media