Narada Puranamu Telugu PDF

Narada Puranam

సనత్కుమారునకు నారదుడు ఉపదేశించినది కావడం వల్ల, “నారద పురాణం” అనే పేరు స్థిరపడింది. సత్యహరిశ్చంద్రుని గాథ ఈ పురాణంలో చెప్పబడింది.

పురాణాల గొప్పదనం, శివకేశవుల అభేదం, భక్తికి గల ప్రాముఖ్యం, సదాచార ప్రాశస్త్యం, శ్రీకృష్ణుని ప్రభావం, బ్రహ్మాండోత్పత్తి, రాజధర్మాలు మొదలైన ఎన్నో విషయాల గురించి ఈ నారద పురాణం లో వివరించబడిఉంది.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

పురీ ద్వార వతీ చైవ సప్తయితే  మోక్ష దాయికాః

మోక్షదాయకములైన ఏడు క్షేత్రముల ప్రాశస్త్యాన్ని తెలిపే పై శ్లోకం ఉద్ఘాటించబడిందీ ఈ నారద పురాణంలోనే.

“శ్రీరాముడు అరణ్యవాసము చేసినప్పుడు కళ్యాణతీర్థమున మునిగి, నారాయణగిరి మీద ఉన్న నారాయణుని సేవిస్తాడు. పట్టాభిషేకం అయిన తర్వాత, ఆంజనేయున్ని పిలిచి నారాయణగిరి మీదనున్న విగ్రహాన్ని తెమ్మని రాముడు చెప్పగా, హనుమంతుడు అక్కడ ఉన్న అర్చావిగ్రహాన్ని తెచ్చి రాముడికిస్తాడు. రాముడు తన తరువాత, పూజించమని కుశునికిస్తాడు. కుశునికి హేమమాలికతో ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె అల్లారుముద్దుగా పెరిగి పెద్దదౌతుంది.

కుశుడు ఆమెకు వరుడిని వెతుకుతుండగా సీతారాములు స్వప్నంలో కనిపిస్తారు. రాముడు “యదుభూషణుని కొడుకు యదుశేఖరుడు ఉన్నాడు, వానికి మీ కూతురునిచ్చి పెండ్లి చేయి” అని చెప్పగా, సీత “ఆడపిల్ల పుట్టింటి నుండి సారెలు తీసుకొని పోవడం ఆచారం. ఆమె అడిగినది ఇచ్చి పంపు” అని చెప్తుంది. నారదుడు పెండ్లి పెద్దగా సంబంధము నిశ్చయమవుతుంది.
కుశుడు కుమార్తెకు పెండ్లి చేసి సారెలిచ్చి పంపటానికి సిద్ధమయ్యే సమయంలో, ఆమె తన తండ్రితో “నాన్నా! మన కులదైవమైన నారాయణమూర్తి విగ్రహాన్ని నాకు ఇస్తే ఆనందముగా బయలుదేరుతాను” అనగా కుశుడు ఆమెకు ఆ విగ్రహాన్ని ఇచ్చేస్తాడు. క్రొత్త దంపతులు మాధవుని విగ్రహంతో తమ పురానికి వెళ్లి ఒక మందిరములో ప్రతిష్టించి పూజిస్తూ ఉంటారు. అది క్రమముగా యాదవ కులదీపమైన వసుదేవుని యొద్దకు వస్తుంది. శ్రీకృష్ణుడు ఆ వంశంలో పుట్టి కంసవధ చేసిన తరువాత ఒక నాడు బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ నారాయణాద్రి కి వచ్చి అక్కడ ఉన్న నారాయణుని విగ్రహమును చూచి పరమ భక్తితో సేవించి ఇంటికి వచ్చి కృష్ణునితో ఇలా చెప్పాడు – “కృష్ణా! నాకు ఇది వింతగా ఉంది, నారాయణాద్రి మీద ఉన్న విగ్రహ రూపమునకు మన ఇంటిలో ఉన్న విగ్రహ రూపమునకు భేధము రవ్వంత అయినా నాకు కనబడలేదు”. కృష్ణ బలరాములు ఆ విగ్రహంతోను, వాసుదేవాదుల తోను నారాయణాద్రి కి వెళ్లి ఈ మూర్తి ని కూడా అక్కడ ప్రతిష్టించి, సేవించి అమితానందము పొందిరి. అప్పటినుండి అది యాదవాద్రి అని పేరు పొందెను. అవతార పురుషులు కూడా జగత్ కళ్యాణం కోసం కొన్ని లోకాచారాలను పాటిస్తూ ఉంటారు” – ఇలాంటి ఎన్నో అద్భుతమైన వృత్తాంతాలు ఈ నారద పురాణం లో దర్శనమిస్తాయి.

ఈ పురాణాన్ని భక్తితో చదివినా, వినినా, లేదా వినిపించినా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుందని ఫలశ్రుతి.

Narada Puranamu in Simple to read PDF book online is here. Read, Download Telugu 18 puranas with greater Telugu. Narada Puranam is one of the holy Hindu puranas.

Download PDF Book

Narada Puranamu

This content is locked

Login To Unlock The Content!

Follow us on Social Media