vayu purana

Vayu Puranam in Telugu PDF

ఈ వాయు పురాణం లో మొత్తం 112 అధ్యాయాలు ఉన్నాయి ,శ్లోకాలు దాదాపు 11000. ఈ పురాణం నాలుగు భాగాలుగా విభజించబడింది .వీటిని పాదాలు అంటారు. 1)అనూషoగా పాదం 2)ప్రక్రియ పాదం 3)ఉపోద్ఘాత పాదం 4)ఉపసంహార పాదం అనేవి నాలుగు.మొదటి పాదం 1-6అధ్యాయాలు,  రెండవ పాదం 7-64 అధ్యాయాలు, మూడవ పాదం 65-99 నాలుగో పాదం 100-112 అధ్యాయాలు వెరసి 112 అధ్యాయాలు ఉన్నాయి.భారతీయ సంస్కృతికి కొన్ని వేల సంవత్సరాల నుంచి మూలాధారాలు నిలుస్తున్నాయి వేదాలు .

ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా ఎన్ని సాంస్కృతిక దౌర్జన్యాలు చోటు చేసుకున్న మన సనాతన సంస్కృతి ఈనాటికీ నిలిచి ఉంది కారణం వేదాలని చెప్పుకోవాలి. వేదాల ద్వారా మన జీవితంలో తప్పకుండా ఆచరించవలసిన కర్తవ్యాలను ,విధులను తెలుసుకున్నాము. వేదాలలో చెప్పబడిన అంశాలు చాలా వరకు గుప్తంగా ఉంటాయి .సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా ఉపదేశం చేయడానికి పురాణాలు ఉద్భవించాయి. భారతీయ సంస్కృతి యొక్క స్వరూప స్వభావాలను సమగ్రంగా తెలుసుకోవాలంటే పురాణం అధ్యయనం చాలా ముఖ్యం.వాయు పురాణం అన్ని పురాణాలు కంటే చాలా ప్రాచీన మైనది మిగిలిన వాటితో పోలిస్తే ఇది పరిమాణంలో చిన్నది.

ఈ పురాణం నాలుగు పాదాలు విభజించబడింది మొదటి పాదంలో సృష్టి క్రమాన్ని గురించి అనేక అధ్యాయంలో చాలా విపులంగా వర్ణించారు. తరువాత భౌగోళికవిషయాల అధ్యయనం కోసం ఈ పురాణం చాలా ఉపయోగమైన గ్రంథం. దీనిలో జంబూ ద్వీప వర్ణన విస్తృతంగా ఉంది, అలాగే ఇతర విభాగం ద్వీపాల గురించి కూడా చక్కని శైలిలో 6 అధ్యాయాలలో వివరించారు.ఖగోళ వర్ణన కూడా అగ్ని పురాణంలో విస్తృతంగా చేయబడింది అనేక విషయాలలో యజ్ఞం , రుషి ,తీర్థం వర్ణాలు విస్తృతంగా ఉంటాయి. ప్రజాపతి వంశవర్ణనము ,రుషి వంశవర్ణనము, ప్రాచీన బ్రాహ్మణ వంశాలచరిత్ర తెలుసుకోవడానికి ఈ వివరాలు చాలా ఉపయోగపడతాయి .

ఈ పురాణం వైశిష్ట్యం శివ చరిత్ర విస్తృతంగా వర్ణించడం.చాలా అధ్యాయాలు విష్ణువర్ణన కూడా ఉంది. విష్ణు మహత్యం ఆయన అవతారాల వర్ణన మనకు చాలా అధ్యాయాలలో కనిపిస్తుంది. పశుపతి ఆరాధన తెలిపిన పాశుపతయోగ ప్రక్రియ ఈ పురాణంలో చాలా ప్రత్యేకం.పాశుపతయోగ ప్రక్రియ 11-15 అధ్యాయాలలో చాలా వివరంగా వివరించబడింది. 30 వ అధ్యాయం లో దక్ష ప్రజాపతి చేసిన శివ స్తుతి చాలా అద్భుతమైనది.వేలకొలది శ్లోకాలు వందలకొలదీ వృత్తాంతాలు ఉన్న ఒక్కొక్క పురాణం ఒకే విధంగా ఉండడం కుదరని పని అందుకే .ఇవి భాగ,ఖండ, అంశ, పర్వ,పాద సంహిత అధ్యాయాలుగా విభజించబడ్డాయి అంటే అన్ని విభాగాలు ఒకే పురాణంలో ఉంటాయని కాదు. 

Vayu puranam is one of the astha dasa puranalu (18 Puranas). Vayu puranam is also belongs to shivam. Read, Download Sri Vayu puranam online.

GET Vayu puranam here

https://www.greatertelugu.org/wp-content/uploads/2017/07/Sri-Vayu-Mahapuranam.pdf

Follow us on Social Media